📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినెల్లబల్లిలో ‘స్మార్ట్ శ్రామిక మిషన్’ గ్రామసభ విజయవంతం

నెల్లబల్లిలో ‘స్మార్ట్ శ్రామిక మిషన్’ గ్రామసభ విజయవంతం

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం నెల్లబల్లి గ్రామంలో ‘స్మార్ట్ శ్రామిక మిషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ ఘనంగా జరిగింది. “మన గ్రామం – మన బాధ్యత – మన అభివృద్ధి” నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల అనుసంధానం, బ్యాంకింగ్ సేవలు అందించడమే మిషన్ లక్ష్యమని అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మిషన్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రావు, నేషనల్ మిషన్ డైరెక్టర్ నైమిషా, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరామ్, కోఆర్డినేటర్ హరి, తిరుపతి డీఎంసీ పి. విజయలక్ష్మి, డీవీఎంసీలు, స్థానిక నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!