📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసాహసానికి సెల్యూట్… ధైర్యానికి జోహార్లు!

సాహసానికి సెల్యూట్… ధైర్యానికి జోహార్లు!

📰 Generate e-Paper Clip

తోటి విద్యార్థినిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన బాలిక లక్ష్మికి రాష్ట్రపతి పురస్కారం ఇవ్వాలి!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు,ఆంధ్ర ప్రదేశ్: రాప్తాడు ఘటనలో తోటి విద్యార్థినిపై రంపం మిషన్‌తో దాడికి పాల్పడిన వ్యక్తిని అడ్డుకునేందుకు, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకొచ్చిన బాలిక లక్ష్మి ధైర్యసాహసాలు అభినందనీయం. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తోటి విద్యార్థినిని రక్షించేందుకు ఆమె చేసిన ప్రయత్నం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.

దాడి జరిగిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేయడం సులభమే. కానీ ప్రమాదం కళ్లముందు ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఎదురు నిలబడటం అందరికీ సాధ్యం కాదు. లక్ష్మి చూపించిన ధైర్యం కేవలం సాహసం మాత్రమే కాదు.. మానవత్వానికి, తోటి మనిషి పట్ల బాధ్యతకు నిదర్శనం.

లక్ష్మికి ప్రభుత్వం అందించాల్సిన గౌరవం, సహాయం:

బాలిక లక్ష్మి సాహసాన్ని గుర్తించి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పురస్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి.

ఆమె ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతిని ప్రకటించాలి.

లక్ష్మి వైద్య ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరించి, సంపూర్ణంగా కోలుకునే వరకు అవసరమైన వైద్య సహాయం అందించాలి.

ఆమె విద్యాభవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని, ఉన్నత విద్య వరకు అండగా నిలవాలి.

ప్రభుత్వాలకు విజ్ఞప్తి!

సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సమాజంలోని మానవ సంపదను కాపాడటం అంతకంటే ముఖ్యం. ఆడపిల్లల భద్రత, ఆత్మగౌరవం, విద్య, భవిష్యత్తు ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావాలి.

లక్ష్మి లాంటి బాలికల సాహసాన్ని గుర్తించి గౌరవించినప్పుడే సమాజంలో మానవత్వానికి మరింత విలువ పెరుగుతుంది. బాలికల ధైర్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం లభించాలి.

లక్ష్మి… నీవు త్వరగా కోలుకోవాలి. నీ ధైర్యం వేలాది మంది బాలికలకు స్ఫూర్తిగా నిలవాలి.

నీ సాహసానికి హృదయపూర్వక సెల్యూట్!

– సంస్కరణల సమాజం కోసం… మానవత్వం, సమానత్వం, బాధ్యతాయుత పాలన కోసం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!