📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా హస్తం గుర్తుతో బరిలో పీడీ నారాయణస్వామి!

పుత్తూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా హస్తం గుర్తుతో బరిలో పీడీ నారాయణస్వామి!

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు: అక్టోబర్ 31:

పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుతో పీడీ నారాయణస్వామి ఎన్నికల బరిలో నిలిచారు. నగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కార్తికేయన్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇది తొలి విజయంగా పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు అభివర్ణిస్తున్నారు.

ఇప్పటివరకు పెద్దగా కనిపించని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును సుమారు 40 వేల బ్యాలెట్ పేపర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా అభ్యర్థిని బరిలో నిలపడం పట్ల పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి పీడీ నారాయణస్వామి మాట్లాడుతూ..

“నేను సింగంధర్ సామాజిక వర్గానికి చెందినవాడిని. మా సామాజిక వర్గంలో అత్యధిక మంది మరమగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారు. మరమగ్గాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. నన్ను గెలిపిస్తే కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ఏ కార్మికుడికి ఏ సమస్య వచ్చినా, నన్ను పిలిచిన వెంటనే వారి పక్షాన నిలబడి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాను.

నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తికేయన్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నేడు జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఆలోచించి హస్తం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి, నన్ను ఆదరించి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పీడీ నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!