📄 ePaper
Monday, September 21, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచౌడేపల్లిలో భక్తిశ్రద్ధల నడుమ బొజ్జ గణపయ్య నిమజ్జనం

చౌడేపల్లిలో భక్తిశ్రద్ధల నడుమ బొజ్జ గణపయ్య నిమజ్జనం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, సెప్టెంబర్ 20:
చౌడేపల్లి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుల విగ్రహాలను ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలోని నేతాజీ నగర్, బజార్ వీధి, శ్రీరామస్వామి ఆలయ సమీప ప్రాంతాలతో పాటు వివిధ వీధుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో నిమజ్జనానికి తరలించారు.

నిమజ్జనోత్సవంలో భాగంగా యువతీ యువకులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘బళ్లారి డ్రమ్స్’ వాయిద్యాల హోరుతో చౌడేపల్లి వీధులు మారుమోగాయి. డ్రమ్స్‌ శబ్దాలకు అనుగుణంగా యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు.

“జై గణేష్‌.. మోరియా”, “గణపతి బప్పా మోరియా.. మళ్లీ ఏటికి త్వరగా రా” అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వినాయకుని శోభాయాత్ర సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!