📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
HomeEntertainmentCelebrity Newsశబ్ద కాలుష్యంపై అల్లు శిరీష్‌ ఫిర్యాదు

శబ్ద కాలుష్యంపై అల్లు శిరీష్‌ ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, సెప్టెంబరు 28,సత్య వెలుగు న్యూస్ : పండుగలు, వేడుకల సమయంలో శబ్ద కాలుష్యంపై చర్చ జరగడం సాధారణమే. ముఖ్యంగా డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, రాత్రివేళల్లో భారీ శబ్దాలపై ఏటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ చేసిన ఓ ఫిర్యాదు కూడా ఇదే అంశంపై చర్చకు దారితీసింది. రాత్రివేళల్లో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినిపిస్తున్నాయని ఆయన హైదరాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
రాత్రి 2–3 గంటల వరకు శబ్దాలు
తాను షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌లో నివసిస్తున్నట్లు అల్లు శిరీష్‌ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. తన నివాసానికి సమీపంలోని వినోభా నగర్‌ హనుమాన్‌ దేవాలయం వద్ద కొంతకాలంగా అనుమతించిన పరిమితికి మించి లౌడ్‌స్పీకర్లలో భారీ శబ్దంతో పాటలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా రాత్రి 2 నుంచి 3 గంటల వరకు కూడా శబ్దం కొనసాగుతోందని తెలిపారు.
పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు
ఈ విషయంపై ఇప్పటికే ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్‌ వెల్లడించారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో సెప్టెంబరు 25 వరకు సహకరించాలని పోలీసులు కోరారని.. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా భారీ శబ్దాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తమ నివాస సముదాయంలోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెబుతూ తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
పోలీసుల స్పందన.. నెటిజన్లలో చర్చ
అల్లు శిరీష్‌ ఫిర్యాదుపై హైదరాబాద్‌ పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన సామాజిక మాధ్యమ పోస్టుకు బదులిచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు అల్లు శిరీష్‌ ఫిర్యాదుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం సరైనదేనని కొందరు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు పండుగల సమయంలో కొంతకాలం శబ్దాలు ఉండటం సహజమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పండుగల సమయంలో ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు శబ్ద కాలుష్య నిబంధనలను అన్ని సందర్భాల్లోనూ సమానంగా అమలు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!