📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి ఎకనామిక్ రీజియన్ సదస్సులో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో...

తిరుపతి ఎకనామిక్ రీజియన్ సదస్సులో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా సదస్సు

📰 Generate e-Paper Clip

తిరుపతి: స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా తిరుపతి కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో నిర్వహించిన తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) భాగస్వామ్యుల సదస్సులో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.

తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ, రెవెన్యూ–ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేశ్ కుమార్ మీనా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సమగ్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని కోరారు.

నియోజకవర్గ పరిధిలోని మాంబట్టు సెజ్, మేనకూరు సెజ్‌లలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెజ్‌లలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు.

అలాగే పులికాట్ సరస్సు మధ్యలో ఉన్న ఇరుకం ఐలాండ్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ప్రస్తావించారు. బోటింగ్, రవాణా సౌకర్యాలు, పర్యాటక మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఇరుకం ఐలాండ్‌ను అంతర్జాతీయ స్థాయి ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు.

పోర్టులు, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న సూళ్లూరుపేట–నాయుడుపేట ప్రాంతాలను ప్రధాన లాజిస్టిక్స్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

ఈ సమావేశంలో ప్లానింగ్ విభాగం జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్, జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!