📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeస్పోర్ట్స్సిరీస్‌ గెలిచినా గిల్‌కు అరుదైన రికార్డు

సిరీస్‌ గెలిచినా గిల్‌కు అరుదైన రికార్డు

📰 Generate e-Paper Clip

ముల్లాన్‌పూర్‌, అక్టోబరు 4,సత్య వెలుగు న్యూస్ : వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మూడో వన్డేలో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్‌.. భారత్‌కు షాకిచ్చింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది. అయితే మూడో వన్డేలో భారత్‌ ఓడిపోయినప్పటికీ.. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.
మూడు మ్యాచ్‌ల్లో 334 పరుగులు
మూడో వన్డేలో గిల్‌ విఫలమైనప్పటికీ.. తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడి బ్యాట్‌ నుంచి వరుసగా శతకం, డబుల్‌ సెంచరీ వచ్చాయి. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో కలిపి గిల్‌ 334 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు.
దిగ్గజాల సరసన గిల్‌
ఈ అవార్డుతో గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధికసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో దిగ్గజాలు యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్‌ ధోనీ, సౌరవ్‌ గంగూలీల సరసన నిలిచాడు. వీరందరూ ఏడేసి సార్లు ఈ అవార్డు అందుకోగా.. గిల్‌ కూడా ఏడోసారి ఈ ఘనత సాధించాడు.
70 ఇన్నింగ్స్‌ల్లోనే..
కేవలం 70 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే గిల్‌ ఏడుసార్లు సిరీస్‌ ఉత్తమ ఆటగాడిగా నిలవడం విశేషం. అతడి అవార్డులన్నీ 2022 తర్వాతే రావడం గమనార్హం. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ 15 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్‌ కోహ్లీ 11 అవార్డులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. యువీ, ధోనీ, గంగూలీలతో కలిసి గిల్‌ మూడో స్థానంలో ఉన్నాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో గిల్‌ మరోసారి రాణిస్తే ఈ దిగ్గజాల రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!