📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపుత్తూరులో సబ్‌జైలు నిర్మాణం వెంటనే చేపట్టాలి

పుత్తూరులో సబ్‌జైలు నిర్మాణం వెంటనే చేపట్టాలి

📰 Generate e-Paper Clip

హోం మంత్రి వంగలపూడి అనితకు విజ్ఞప్తి చేసిన పోతుగుంట విజయ్‌బాబు

పుత్తూరు: పుత్తూరు పట్టణంలో సబ్‌జైలు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్‌బాబు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కోరారు. ఈ మేరకు అమరావతిలో హోం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గతంలో 22-12-2025న సబ్‌జైలు నిర్మాణం కోసం తాను అందజేసిన వినతిపత్రం విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి గుర్తు చేశారు. పుత్తూరు మండలం నందిమంగళం రెవెన్యూ పరిధిలోని ఎన్‌జీవో కాలనీ సమీపంలో సబ్‌జైలు నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 2011లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు.

సుమారు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో సబ్‌జైలు భవనాన్ని నిర్మించేందుకు చర్యలు ప్రారంభమైనప్పటికీ, ప్రారంభ దశలోనే పనులు నిలిచిపోయాయని విజయ్‌బాబు వివరించారు.

ప్రస్తుతం పుత్తూరులో సబ్‌జైలు లేకపోవడంతో ఇక్కడి ఖైదీలను సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు జైళ్లకు తరలిస్తున్నారని తెలిపారు. దీంతో ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు వారిని కలిసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పుత్తూరు ప్రాంత ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకుని సబ్‌జైలు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై హోం మంత్రి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించి, సబ్‌జైలు నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పోతుగుంట విజయ్‌బాబు తెలిపారు.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!