📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా పుత్తూరులో 5కే వాక్‌థాన్

వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా పుత్తూరులో 5కే వాక్‌థాన్

📰 Generate e-Paper Clip

పుత్తూరు, అక్టోబర్ 17, సత్య వెలుగు న్యూస్: వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 18) పుత్తూరులో 5కే వాక్‌థాన్ నిర్వహించనున్నట్లు వాకర్స్ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ కోనేటి రవిరాజు తెలిపారు.

  1. ఆదివారం ఉదయం 6 గంటలకు పుత్తూరులోని వాకర్స్ బిల్డింగ్ నుంచి వాక్‌థాన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి కె.ఎన్. రోడ్డు సర్కిల్‌కు చేరుకుని కేక్ కట్ చేసిన అనంతరం, ద్రౌపదమ్మ గుడి, బజారు వీధి మీదుగా బాలికల జూనియర్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.

వాకర్స్ ఇంటర్నేషనల్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాకర్స్ సభ్యులతో పాటు పుత్తూరు పట్టణ ప్రజలకు డాక్టర్ కోనేటి రవిరాజు విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలు, వాకర్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!