నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్ : నాయుడుపేట మండలంలోని పూడేరు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెలవల రాజేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నెలవల రాజేష్ మాట్లాడుతూ పూడేరు ప్రజలు తనను ఆశీర్వదించి, ఎంపీటీసీగా గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్లపూడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్య వెలుగు న్యూస్ ప్రజా వార్తలు – ప్రజల కోసం

