పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలం శిరసనంబేడు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేలూరు మోహన రూప రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వేలూరు మోహన రూప రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సహకారంతో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
1982 నుంచి నేటి వరకు తమ కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. తన మామ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వేలూరు మురళీకృష్ణారెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు శిరసనంబేడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
శిరసనంబేడు సెగ్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తానని వేలూరు మోహన రూప రెడ్డి హామీ ఇచ్చారు.




