-కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
కాదలూరు, నవంబర్ 5 ,సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా తడ మండలం పరిధిలోని కాదలూరు గ్రామంలో సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలను ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించే గొప్ప బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ మనస్సాక్షి ప్రకారం స్వేచ్ఛగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



