📄 ePaper
Friday, November 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ అధికారి హరిత మృతి

ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ అధికారి హరిత మృతి

📰 Generate e-Paper Clip

-మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం
సత్య వెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా పోలింగ్ అధికారి అస్వస్థతకు గురై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారి హరిత (58) గురువారం ప్రాణాలు కోల్పోయారు.
హరిత అనంతపురం జిల్లా డి.హీరాహల్ మండలం పూలకుర్తి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా కాడదారకుంట పోలింగ్ కేంద్రానికి హాజరైన ఆమెకు అకస్మాత్తుగా శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది.
వెంటనే స్పందించిన పోలింగ్ కేంద్రంలోని వైద్య బృందం ఆమెను కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అత్యవసర చికిత్స అందించింది. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఆమె మృతి చెందారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
పోలింగ్ అధికారి హరిత మృతిపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం హరిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఉద్యోగిని మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!