–ఇల్లత్తూరు MPTC ఫలితంపై అభ్యంతరం..
-రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్
సత్య వెలుగు న్యూస్ నగిరి: నగరి డిగ్రీ కళాశాల వద్ద మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా నిరసనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు MPTC స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించినప్పటికీ, టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆర్కే రోజా, వెంటనే రీకౌంటింగ్ నిర్వహించి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
కౌంటింగ్ కేంద్రం నుంచి MPTC అభ్యర్థిని పోలీసులు బయటకు పంపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా, వైసీపీ కార్యకర్తలతో కలిసి కౌంటింగ్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇల్లత్తూరు MPTC ఫలితంపై నెలకొన్న వివాదం స్థానికంగా రాజకీయ వేడిని రాజేసింది. రీకౌంటింగ్ నిర్వహించి వాస్తవ ఫలితాన్ని ప్రకటించాలని వైసీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి.




