నగరి, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్:
నగరి రూరల్ మండలం దేసూరు అగరం దళితవాడలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు.
శ్రీకృష్ణ మందిరం నిర్మాణం కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కృషి చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై స్థానిక ప్రజలకు ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

