📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలి, సర్వే నంబర్ 199లో స్థలాల కోసం పేదల...

నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలి, సర్వే నంబర్ 199లో స్థలాల కోసం పేదల విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

పుత్తూరు, సెప్టెంబర్ 29 — సత్య వెలుగు న్యూస్:

తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నందిమంగళం (కోనేటిపాలెం) పరిధిలోని సర్వే నంబర్ 199లో నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇళ్లు లేక, అద్దెలు చెల్లించలేక, ఉమ్మడి కుటుంబాల్లో ఇరుకైన గదుల్లో నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేద కుటుంబాలు వాపోతున్నాయి. కొందరు కనీసం తలదాచుకునేందుకు గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని తెలిపారు.

గుడారాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి రెవెన్యూ అధికారులు వచ్చి అది ప్రభుత్వ భూమి కావడంతో ఆక్రమణకు అనుమతి లేదని పేర్కొంటూ వాటిని తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.

అయితే హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమ సమస్యపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీలు, నిరుపేద కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి, అర్హత ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు కల్పించకుండా గుడారాలను తొలగించడం వల్ల తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!