📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 20 కుటుంబాలు, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన నగరి...

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 20 కుటుంబాలు, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

📰 Generate e-Paper Clip

పుత్తూరు, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్:

పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం పంచాయతీ దళితవాడ, కూర్మానుకండ్రిగ దళితవాడకు చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేస్తున్న కృషికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!