📄 ePaper
Thursday, September 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్డా. సి.వి. రామన్ డిగ్రీ కాలేజీలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

డా. సి.వి. రామన్ డిగ్రీ కాలేజీలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

📰 Generate e-Paper Clip

నాయుడుపేట: డా. సి.వి. రామన్ డిగ్రీ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఎస్.కె. ఖాదర్ బాబు, జి.వి.వి. గోపాల్, ఎం. వెంకటేశ్వర్లు పాల్గొని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.

అనంతరం కళాశాల అధ్యాపక బృందం సభ్యులు డి. అనిల్ కుమార్, జి. చంద్రయ్య, బి. హోలీ కృష్ణ, ఎం. శ్రీనివాసులు, టి. ప్రసన్న, ఎ. సుప్రజ, డి. శ్రీనివాసులు, బి. ప్రదీప్ కుమార్, కె. సురేష్, జి. సుబ్రహ్మణ్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అధ్యాపకులకు సత్కారం

టీచర్స్ డే సందర్భంగా కళాశాల యాజమాన్యం అధ్యాపకులకు స్వీట్లు, గిఫ్ట్ బాక్సులు అందజేసి సత్కరించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను అభినందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

“గురువు జ్ఞానాన్ని అందించడమే కాదు.. విద్యార్థి జీవితానికి సరైన దిశను చూపిస్తాడు” అనే సందేశంతో కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!