చిట్టమూరు, అక్టోబర్ 5: గూడూరు ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు చిట్టమూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో చిట్టమూరు, యల్లసిరి, కొగిలి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
చిట్టమూరు గ్రామంలో రూ.58 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ సెంటర్ (పీహెచ్‌సీ) ల్యాబ్‌కు, అలాగే రూ.1.40 లక్షలతో పీహెచ్‌సీ భవనం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా యల్లసిరి గ్రామపంచాయతీలో రూ.15 లక్షలతో, కొగిలి గ్రామపంచాయతీలో రూ.36 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించారు. మొత్తంగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.51 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుండు బోయిన కస్తూరయ్య, ఏఎంసీ డైరెక్టర్, క్లస్టర్ ఇన్‌చార్జ్ మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, మల్లాం పీఏసీఎస్ చైర్మన్ రామిశెట్టి హరినాథ్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ రషీద్, యూనిట్ ఇన్‌చార్జ్ కాపులూరు చెంచురామాచారి, బీసీ సెల్ అధ్యక్షుడు దొడ్డ వెంకటరమణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లూరు మణి, మాజీ సర్పంచ్ పోలిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే నాయకులు మునిబాబు నాయుడు, పల్లం వెంకటరమణయ్య, బసవనూరు వెంకటేశ్వర్లు, బందిలి అంకయ్య, మణి, ఆసుపత్రి సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఏపీవో, ఏపీఎం అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.




