సత్య వెలుగు న్యూస్,కోట: తిరుపతి జిల్లా కోట మండలం చెందోడు గ్రామంలో స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఓటర్లు ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు.



