తిరుపతి జిల్లా, పెళ్లకూరు: పెళ్లకూరు మండలంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని మొత్తం 38 పోలింగ్ కేంద్రాల పరిధిలో 27,653 మంది ఓటర్లు ఉండగా, వారిలో 21,018 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తంగా 76.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల గణాంకాలు వెల్లడించాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనడంతో మండలవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.



