📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెంకటరమణకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

వెంకటరమణకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

తిరుపతి, సెప్టెంబర్ 29, సత్య వెలుగు న్యూస్:
తిరుపతి రైల్వే స్టేషన్ SVS యూనియన్ సెక్రటరీ, శ్రీ వెంకటరమణ జన్మదిన వేడుకలు స్నేహితులు, యూనియన్ కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహంగా నిర్వహించారు.

జన్మదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో పాటు గ్రామ దేవత ఆశీస్సులు పొందేందుకు తన స్నేహితులతో కలిసి గ్రామ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందడం పట్ల స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీ వెంకటరమణకు గ్రామ దేవత చల్లని చూపు, శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని స్నేహితులు ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా SVS యూనియన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు శ్రీ వెంకటరమణకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!