📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగంజి మాధవయ్యను సన్మానించిన గోపాలక్రిష్ణాపురం ఎస్‌ఎంసీ కమిటీలు

గంజి మాధవయ్యను సన్మానించిన గోపాలక్రిష్ణాపురం ఎస్‌ఎంసీ కమిటీలు

📰 Generate e-Paper Clip

పుత్తూరు రూరల్, సెప్టెంబర్ 30: పుత్తూరు రూరల్ మండలం గోపాలక్రిష్ణాపురం జెడ్పీ హైస్కూల్, ఎంపీయూపీ పాఠశాలల్లో నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) సభ్యులు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, పుత్తూరు మాజీ ఎంపీపీ గంజి మాధవయ్యను ఆయన స్వగృహంలో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జెడ్పీ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్ శిరీష్, వైస్‌ చైర్మన్ సుమతి, ఎంపీయూపీ పాఠశాల చైర్మన్ రుద్రమూర్తి, వైస్‌ చైర్మన్ హేమలత గంజి మాధవయ్యను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు అరవ బాలాజీ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, తడుకు సింగిల్ విండో ప్రెసిడెంట్ కరుణా యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగా కుమార్, బూత్ కన్వీనర్ హరిగోపాల్, ఐటీడీపీ కన్వీనర్ ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!