📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుచీకట్లో మగ్గుతున్న మెట్టు గ్రామం , కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా వీధి దీపాలు...

చీకట్లో మగ్గుతున్న మెట్టు గ్రామం , కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా వీధి దీపాలు బిగించని అధికారులు

📰 Generate e-Paper Clip

చిట్టమూరు మండలం, అక్టోబర్ 4: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం రాత్రి వేళల్లో గాఢాంధకారంలో మునిగిపోతోంది. గ్రామంలో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెల రోజుల క్రితం గ్రామంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అయితే స్తంభాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి వీధి దీపాలు బిగించకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు పాత వీధి దీపాలు కూడా మరమ్మతులకు నోచుకోకపోవడంతో గ్రామంలోని పలు ప్రాంతాలు పూర్తిగా చీకటిమయంగా మారాయి.

రాత్రి 7 గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటే భయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చీకటి కారణంగా పాములు, తేళ్ల భయంతో పాటు దొంగతనాలపై కూడా ఆందోళన నెలకొంటోందని పేర్కొన్నారు.

కొత్త స్తంభాలు ఏర్పాటు చేసినా వాటికి లైట్లు ఏర్పాటు చేయకపోవడంపై పంచాయతీ కార్యదర్శి, సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మెట్టు గ్రామంలోని కొత్త విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని పాత లైట్లను మరమ్మతు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంచాయతీ నిధులతో వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న చీకటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!