చౌడేపల్లి, అక్టోబర్ 10 ,సత్య వెలుగు న్యూస్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఎస్.కే. రమణారెడ్డి జన్మదిన వేడుకలు చౌడేపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంపిణీ చేశారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఎస్.కే. రమణారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమల సురేష్, సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, మాజీ రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఆసూరి బాలాజీ, అంజుమాన్ కమిటీ కార్యదర్శి షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎస్.కే. రమణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




