చౌడేపల్లి, సెప్టెంబర్ 17 (సత్య వెలుగు న్యూస్): ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారమే పునాది అని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రోకియా బేగం అన్నారు. చౌడేపల్లి మండలం ఆమెనిగుంట పంచాయతీ బురగపల్లె అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ‘పోషణ్ మాహ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి రోకియా బేగంతో పాటు పుంగనూరు ప్రాజెక్ట్ సీడీపీఓ రాజేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత, అపౌష్టికతను నివారించవచ్చని వివరించారు. అలాగే బాల్యవివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.


