📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతి పవిత్రతను కాపాడాలి తిరుమల ప్రధాన దారుల్లోని మద్యం షాపులు తొలగించాలి – జిల్లా కలెక్టర్‌కు...

తిరుపతి పవిత్రతను కాపాడాలి తిరుమల ప్రధాన దారుల్లోని మద్యం షాపులు తొలగించాలి – జిల్లా కలెక్టర్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ వినతి

📰 Generate e-Paper Clip

తిరుపతి,సత్య వెలుగు న్యూస్: తిరుపతి నగరంలోని తిరుమల ప్రధాన మార్గాల్లో ఉన్న వైన్‌ షాపులు, బార్‌ షాపులను తక్షణమే తొలగించాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున వినతిపత్రం అందజేసిన నాయకులు.. తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారని తెలిపారు. తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఉండటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దైవభక్తులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా, తిరుపతి–తిరుమల పుణ్యక్షేత్ర పవిత్రతకు భంగం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మద్యం దుకాణాలు తొలగించాలని కోరిన ప్రధాన మార్గాలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్న ప్రధాన మార్గాలు:

  1. చెర్లోపల్లి – అలిపిరి మార్గం
  2. కరకంబాడి – లీలామహల్ రోడ్ – అలిపిరి మార్గం
  3. పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు – అలిపిరి మార్గం
  4. ఉప్పరపల్లి – పద్మావతి కాలేజ్ – బాలాజీ కాలనీ – అలిపిరి మార్గం
  5. అవిలాల హైవే రోడ్ – అన్నమయ్య సర్కిల్ – బస్టాండ్ మార్గం

ఈ మార్గాల్లో భక్తుల రాకపోకలు అధికంగా ఉంటాయని, పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ఆధ్యాత్మిక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

తిరుపతిని మద్యరహిత పవిత్ర నగరంగా ప్రకటించాలి

తిరుపతి నగర పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిని మద్యరహిత పవిత్ర నగరంగా ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ పాల్గొని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!