📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితుమ్మూరులో 1, 32వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరు!

తుమ్మూరులో 1, 32వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరు!

📰 Generate e-Paper Clip

-ప్రచారంలో పాల్గొన్న చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరు ప్రాంతంలో 1వ, 32వ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మతో పాటు 1వ వార్డు అభ్యర్థి బుదురు లక్ష్మి, 32వ వార్డు అభ్యర్థి మేర్లపాక వెంకటరత్నమ్మ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాట్లాడుతూ, ప్రజల ఆదరణతో గెలిచి వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి, తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తుమ్మూరు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బీరదవోలు శ్రీకాంత్ రెడ్డి, నాయుడుపేట మాజీ చైర్‌పర్సన్ కటకం దీపిక, కామిరెడ్డి మోహన్ రెడ్డి, తంబిరెడ్డి మోహన్ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, కేఎంఆర్, మాజీ ఎంపీపీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!