–తుఫాన్ హెచ్చరిక.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!
-కోట తహసీల్దార్ కటారి జయజయరావు సూచన
-గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి
సత్య వెలుగు న్యూస్, కోట: తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు సూచించారు.
సోమవారం గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాలకు చెందిన మత్స్యకారులు, కాపులు ఈ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. తుఫాన్ కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు సముద్రంలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు తమ ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సంబంధిత అధికారుల నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు చేపల వేటకు వెళ్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలు, సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని తహసీల్దార్ కోరారు.




