-ఆశీర్వదించి గెలిపించాలని టీడీపీ అభ్యర్థి కాపులూరు రాణెమ్మ విజ్ఞప్తి
సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 2 | కాపులూరు : కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కాపులూరు రాణెమ్మ తెలిపారు.
సోమవారం ఆమె కాపులూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని కూచివాడ, చిలమత్తూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఓటర్లను కలుసుకుని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా రాణెమ్మ మాట్లాడుతూ.. తనను తమ ఇంటి బిడ్డగా భావించి ఆశీర్వదించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో గెలిచిన అనంతరం గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సహకారంతో కూచివాడ, చిలమత్తూరు, కాపులూరు గ్రామాల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సూపర్ సిక్స్ పథకాలు, పింఛన్లు, ఇళ్ల పట్టాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మాకాని రత్నయ్య, బల్లి ఏసుదాసు, అప్పాడి సుబ్బారాయులు, ముచ్చకాయల గోపి, కాపులూరు నవీన్, కట్టుబోయిన చంద్రశేఖర్, ఏకొల్లు రమణయ్య, అన్నాడిశెట్టి ప్రభాకర్, కాపులూరు చక్రపాణి తదితరులతో పాటు టీడీపీ మండల, గ్రామ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లు, మహిళా, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.




